599 క్రీస్తు అనుగ్రహించు స్వస్థత
రా -మిశ్రమ (చాయ: శరణు జొచ్చితి) తా -ఆది
పరమ వైద్యుఁడ భారతీయుల – వ్యాధి బాధలఁ బాపుమా = పరుల కుపచారం బొనర్చుట – పరమ విధియని చూపుమా ||పరమ||
1. ప్రేమతో వైద్యులును దాదులు – పెంపుఁ బొందఁగ జేయుమా = గ్రామ రోగులఁ గాంచి వారికి – క్షేమమును దయ చేయుమా ||పరమ||
2. భరత ఖండము నందు వైద్యపు – బడులను నెలకొల్పుమా = పరఁగ నీవే వైద్య శాలలఁ – బాలనంబు సల్పుమా ||పరమ||
3. కుఁటి గ్రుడ్డి మూఁగ సాలలఁ – గూర్మితో దర్శించుమా = యంటు రోగుల యాశ్రయముల – నంటి పరామర్శించుమా ||పరమ||
4. లెక్కలేని గర్భవతుల – యక్కఱలను దీర్చుమా = దిక్కు లేని బిడ్డలకు నీ – దీవెనల సమకూర్చుమా ||పరమ||
5. యంత్రశాలల గనులయందు – నలయు వారలం బ్రోవుమా = మంత్ర తంత్రము లందుఁ జిక్కు న – మాయకులను గావుమా ||పరమ||
6. గ్రామ వైద్య సేవఁ జేసెడి – ఘనులఁ బరిపాలించుమా = గ్రామవాసులఁ గూల్చు వ్యాధులఁ – గాంచి నిర్మూలించుమా ||పరమ||
7. దురభిమాన మూఢ భక్తిని – ద్వరగ దూర పరచుమా = మరియు శుచిచే రోగములు మటు – మాయ మగు నని కరపుమా ||పరమ||
8. దేహశుద్ధిని జిత్తశుద్ధిని – దేశ జనులకుఁ గూర్చుమా = దేహములఁ బర శుద్ధ మగు నీ – దేవళములుగ మార్చుమా ||పరమ||
– మల్లెల దావీదు
No comments:
Post a Comment