Kanneerantha thudichivesi | కన్నీరంతా తుడిచివేసి కౌగిలిలో

కన్నీరంతా తుడిచివే - కౌగిలిలో నెమ్మదినిచ్చి(2)
ఓదార్చిన నా యేసయ్యా - నీ మేలు మరువ లేనయ్యా(2)||కన్నీరంతా||

1.ఎవరు లేని ఒంటరివేళ - ఉన్నావయ్యా నాతోడుగా(2)
విడువలేదే...ఏక్షణమైనా (2)
ప్రేమించిన నా యేసయ్యా - నిను విడిచి ఉండలేనయ్యా (2) ||కన్నీరంతా||

2.గుండెపగిలి ఏడ్చిన వేళా - ఓదార్చినా నా యేసయ్యా (2)
భుజము తట్టి నెమ్మదినిచ్చి (2)
బలపరిచిన నా యేసయ్యా - యెహోవా షమ్మా నీవయ్యా (2) ||కన్నీరంతా||

3.తీర్చలేని రుణ భారముతో- కుమిలి కుమిలి ఏడ్చిన వేళా (2)
శ్రీమంతుడవు నను దర్శించి (2)
దీవించిన నా యేసయ్యా - యెహోవా ఈరే నీవయ్యా (2)

కన్నీరంతా తుడిచివేసి - కౌగిలిలో నెమ్మదినిచ్చి(2)
ఓదార్చిన నా యేసయ్యా - నినువిడిచి ఉండలేనయ్యా (2) ||కన్నీరంతా||
- బ్రదర్.ఆదాంబెన్నీ
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: