Devaa Nannela Vidichinaavayya | దేవా నన్నేల విడిచినావయా

దేవా నన్నేల విడిచినావయా - దేవా నన్నేల మరిచినావయా
దీనుడను నేను దిక్కులేని వాడను - దయచూపి ఆదుకొనుమయా
అల్పుడను నేను అనాదను నేను - దరిచేరి ఆదరించుమయా

దేవా.. నా దేవా.... నా యేసయ్యా(2)

1. ఎన్నో ఆశలతో జీవించుచుండగా -
అంతా నా వారేనని నమ్మియుండగా(2)
ప్రేమించినవారే నను మోసగించి -
నే నమ్మినవారే నా చేయి విడిచి(2)
ఒంటరిగా చీకటిలో నిలిచియుంటిని(2)

దేవా.. నా దేవా - నా యేసయ్యా(2)

2.నా జీవితం సుడిగుండాల వలయం -
ఊహించని మలుపులే నిత్య ప్రాప్తం(2)
అనుకున్నవి జరగకా అనుకోనివి జరుగుతు -
అందరు విడిచిన అనాదనైతిని(2)
చావలేక బ్రతకలేక కుములుచుంటిని(2)

దేవా.. నా దేవా - నా యేసయ్యా(2)

దేవా నీకై జీవింతును - నా దేవ నీకై సాక్షినౌదును
దయ చూపి ఆదుకొనుమయా - దేవా నీకై జీవింతును
దేవ నీకై సాక్షినౌదును(2) చేయి చాపి ఆదరించుమయా

No comments: