Anni kaalambula nunna | అన్ని కాలంబుల నున్న

1
దైవ ప్రస్తుతి
రా – కాంభోజి,  తా - ఆది

అన్ని కాలంబుల - నున్న యెహోవా ని నెన్నఁదరంబయో - కన్న తండ్రి - వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుతు - లున్నతమై యుండ - మున్నెనీకు ||నన్ని||

1.నిన్ను బ్రకటన సేయ - నిఖిల లోకములను - బన్నుగఁ జేసిన - బలుఁడ  వీవే = ఉన్న లోకంబుల - నుడుగక కరుణా సం - పన్నతతో నేలు - ప్రభుఁడ వీవె = అన్ని జీవుల నెరిగి - యాహార మిచ్చుచు - నున్నసర్వజ్ఞుం - డవు నీవే - ఎన్న శక్యముగాక - ఉన్న లక్షణముల - సన్నుతించుటకు  నే - జాలుదునా ||యన్ని||

2.పుట్టింప నీవంచుఁ - బోషింప నీవంచుఁ - గిట్టింప నీవంచు - గీర్తింతును = నట్టి పనికి మాలి - నట్టి మానవుల చే - పట్టి రక్షింపఁ బా - ధ్యుండ వంచు  = దట్టమైన కృపను దరిఁజేర్చ నాకిచ్చి - పట్టయి నిలచియుండు - ప్రభుఁడ  వంచుఁ = గట్టడచేఁ గడ - ముట్టుదనుక నా - పట్టుకొలఁది నిన్నుఁ - బ్రస్తు = తింతు llయన్నీll

3.కారుణ్యనిధి వీవు - కఠినాత్ముఁడను నేను - భూరి శుద్ధుఁడ వీవు - పాపి నేను = సార భాగ్యుడ వీవు జగతిలో నాకన్న - దారిద్రుఁడే లేఁడు - తరచి చూడ = సార సద్గుణముల - సంపన్నుఁడవు నీవు - ఘోర దుర్గుణ సం - చారి నేను = ఏ రీతి స్తుతియింతు - నే రీతి సేవింతు - నేర మెన్నక ప్రోవ - నెర నమ్మితి llనన్నిll
-  బేతాళ జాన్
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: