కన్నీటి లోయలలో గాడాంధకారములో
మా మనవులే ఆలకింపవా.. నీ ప్రజలనే దృష్టించవా..
మా వేదనే తొలగించవా.. నీ స్వస్తతే దయచేయవా..
మా దోషములను క్షమియించవా..
నీ కరుణ కటాక్షములు చూపించవా (2) ||నీ ప్రజల||
1. నీ పేరు పెట్టబడిన నీ ప్రజలము -
నీ సన్నిధిలో సాగి లిడెదము -
మా చెడు నడతను విడిచి పెట్టెదం -
నీ మార్గములను అనుసరింతుము (2)
మా మీద దృష్టి నిలిపి మా ప్రార్ధనాలకించి (2)
మా దేశమునే స్వస్థపరచవా -
మా దేశమునే బాగు చేయవా (2) ||నీ ప్రజల||
2. నీ సొంత రక్తమిచ్చి మము కొంటివే -
సొత్తయిన జనముగా మము చేసితివే -
నీ రాజ్య వారసులుగా మము మార్చితివే -
నీ ప్రియ బిడ్డలుగా మము నుంచితివే (2)
మమ్మును కనికరించి నీ మాటనే నెరవేర్చి (2)
నీ ప్రజలనే విడిపించవా -
.నీ ప్రజలనే కాపాడవా (2) ||నీ ప్రజల||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment