08 May 2021

Vacchaadu Vacchaadu Rakshakudu | వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు

జైయహో జై జై జై జైయహో 
జైయహో జై జై జై జైయహో

వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు 
రక్షించేది ఇతడేరా ప్రజల కొరకు పుట్టాడు 
ప్రజల మధ్య ఉన్నాడు ప్రాణాన్నిచ్చిందితడేరా 
ఏది ఆశించని ప్రజాసేవకుడు 
పైసలు ఆశించని రోగుల వైద్యుడితడు 
పాపినైన రోగినైన బాగు చేయును 
ప్రతి పాపికై పవిత్రమైన రక్తమిచ్చెను
                                                    ||వచ్చాడు||
పాపం లేని వాడే రాయే వేయండని 
పాపిని కాపాడే వకీలురా 
పాపం లేని వాడే శిక్ష విధించాలని 
అబలను కాపాడే అన్నితడేరా 
కులమని మతమని తేడా చూపడు 
నువు దొంగవైన ఎవడివైన రక్షిస్తాడితడు 
మంచివాళ్ళకు ఇతడు స్ఫూర్తిడితడు 
పొరుగు వారిని ప్రేమించాలన్నది ఇతడు 
గాంధీకైనా వివేకనందకైనా 
ఏ దేశానికైనా రాజ్యాంగానికైనా 
అందరికీ స్ఫూర్తె ఇతడు రక్తదాతలకే ప్రారంభికుడితడు అన్నేరా మన అన్నేరా పరలోకమైనా ఇచ్చేది మనకేరా నమ్మితే నరకం నుండి కాపాడేదిత డేరా
                                                    ||వచ్చాడు||
పాపం లేనివాడే దేవుడు అవుతాడని 
దేవుని చూపించింది ఇతడేరా 
దేవుని చూడాలంటే నను చూడాలని 
పాపం లేకుండా తెలిపెనురా 
చరిత్రలో కాలాలన్నీ లెక్కించాలి అనుకుంటే 
క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటే ఇతడేరా 
భూపతులకంటే రాజులకంటే రాజాధి రాజు ఎవరంటే యేసు కంటే గొప్పవాడు లేనే లేడురా 
ప్రతి దేశం క్రీస్తునే నమ్మెనురా 
అతని తెలియని వారే భువిలో లేరురా 
ముస్లిం ఐనా హిందూవైనా నాస్తికుడైనా ఆస్తికుడైనా అందరూ వేయాలి తేదీరా అది క్రీస్తు గొప్పతనమని తెలిపెనురా 
మరణించి లేచినదితడేరా మరణిస్తే 
మరో బ్రతుకుందని తెలిపెనురా 
నమ్మితే నరకం నుండి కాపాడేదిత డేరా
                                                    ||వచ్చాడు||
జైయహో జై జై జై జైయహో 
జైయహో నా యేసుకే జైయహో 

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...