ఈ నేల నెత్తుటితో తడిచేనా -
ఆ తల్లి హృదయం వగచేనా (2)
రాజైన యేసయ్యా - నీ కెంత బాధయ్యా
నా పాప శాపం సిలువై నిను వేదించేనా
1.త్యజియించినావు ఆ సౌఖ్యం - దిగివచ్చినావు
నాకోసం నాకిచ్చినావు నీసర్వం - వర్ణించలేను నీ త్యాగం
నా శిక్షయేగా నీ సిల్వమరణం - విడిపించినావయ్యా ||ఈ నేల||
2.ఏ దోషం లేనిది నీ కాయం - అయినా ఎందుకు ఆ గాయం
నీవు నిలిచింది నా స్థానం - నాకై విడిచావు నీ ప్రాణం
వెలలేనిదయ్యా నీ శుద్దరుధిరం - నను కడిగినావయ్యా ||ఈ నేల||
3.భరియించినావు నా శాపం - క్షమియించినావు నా పాపం
సహియించినావు ఆఘోరం - తొలగించినావు నా భారం
విలువైనదయ్యా కల్వరి యాగం - నే మరువలేనయ్యా ||ఈ నేల||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment