Nee Krupaye Nanu Pilichinadi | నీ కృపయే నను పిలిచినది

నీ కృపయే నను పిలిచినది నీ కృపయే బలపరచినది
నీ కృపయే స్థిరపరచినది నీ కృపయే నడిపించినది
యేసయ్యా స్తోత్రములు యేసయ్యా
స్తోత్రములు స్తుతి స్తోత్రములు

అగాధ జలములు నీవు - ఆరిన నేలగా మార్చితివే
నీ కృప నేను వివరించలేను- నీ కృప నేను వర్ణించలేను
                                                ॥ని కృపయే ॥
అమావాస్య చీకటిని నీవు -మధ్యాహనం వలే మార్చితివే
నీ కృప నేను వివరించలేను -నీ కృప నేను వర్ణించలేను
                                                 ॥నీ కృపయే॥
ఏ మంచి లేని నన్ను - కుమారుడా అని పిలచితివే
నీ కృప నేను వివరించలేను- నీ కృప నేను వర్ణించలేను
                                                ॥ని కృపయే॥

No comments: