21 March 2021

Nee Krupaleni Kshanamuna | నీ కృపలేని క్షణమున ఏమౌదునో

నీ కృప లేని క్షణమున ఏమౌదునో 
నీ కృప విడిన క్షణమున ఏమౌదునో 
ఏమౌదునో ఊహించలేనయ్య 
నేనేమౌదునో తెలియదయ్య

1.  రక్షణ నావలో నేనుండగ 
    బాధలు పేనుగాలులై తాకినా 
    మరణపు భయములు అవరించిన 
    శ్రమలు సుడిగుండాలై నన్నుచుట్టిన 
    నీ ప్రేమ చూపితివి నన్ను బలపరచితివి 
    నీ కరములుచాపితివి నన్ను లేవనెత్తితివి 
    నీ నిత్య కృపలో నన్ను దాచితివి..ఇ..ఇ   ||నీ కృప||

2. సాతాను సింహం వలె గర్జించిన 
    హృదయమును గాయపరచి కృంగదిసిన 
    ఇహలోక మనుషులె నిందించిన
    ఆత్మీయులె నాకు దూరమైన 
    నీ ప్రేమ చూపితివి నన్ను ఆదరించితివి 
    నీ కరములుచాపితివి నన్ను స్వస్థపరచితివి 
    నీ దివ్య కృపలో నన్ను దాచితివి ... ఇ..ఇ .. ||నీ కృప||

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...