హృదయమే నీ ఆలయం క్రీస్తు - నీ నామమే నా గానం
విదితము కాదే ఇలలో ఎవరికీ - వివరింపగా నీ పావన రూపం -
హృదయమే నీ ఆలయం క్రీస్తూ...
1. మనిషి మనిషిగా బ్రతకాలని - మంచిని మనసున పెంచాలని
సిలువలో నీవు మరణించి (2) మృత్యువునే నీవు ఎదురించి
వెలసిన దేవుడా నీవే - పాపుల రక్షణ నీవే ||హృదయమే||
2. కారు చీకటిలో కాంతి రేఖవై - మూగ గుండెల్లో దివ్య వాణివై -
దీనులనే నీవు కరుణించి (2) - వేదనలే నీవు తరలించి
పరమున చేరిన దేవా - శరణు శరణు ఓ ప్రభువా ||హృదయమే||
___________________________
Hrudayame nee alayam kreesthu - Nee namame naa gaanamvidhithamu kadhe ilalo evariki - Vivarinchaga nee pavana rupam
Hrudayame nee alyam kreesthu ||Hrudaya||
Manishi manishiga brathakalani - Manchini manasulo penchalani
siluvalo neeve maraninchi (2) - Mruthyuvu ne neevu yedurinchi
Velasina devida neeve - Paapula rakshana neeve ||Hrudaya||
Kaaru cheekatilo kaanthi rekhavai- Muga gundelo dhivya vanivai
Deenulane neevu karuninchi(2) - Vedhanle neevu Tharalinchi
Vanamunu cherina deva - Saranu saranu o prabhuva ||Hrudaya||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment