నీ నామమే ఉదయగానం - నీ వాక్యమే హృదయధ్యానం
ఓయేసు క్రీస్తు నీస్మరణలోనే - నాబ్రతుకు కడతెరని..
పరలోకమును జేరనీ ||నీనామమే||
1.బ్రతుకు బాటలో వెతుకులాటలో - అతుకుల గతుకుల - చితికిన బ్రతుకుల(2)
సాతాను సంకెళ్ళలో - పాపాల స్మృతి జ్వలలో
శోదన రోదన ఆవేదనలో - ఈ బ్రతుకు ఇక మోయాలేను ||నీనామమే||
2.కల్వరిగిరిలో శ్రమలు సహించి - సిలువలో నీవే రక్తము చిందించి (2)
సాతనునే సంహరించి - పాపలనే పరిహరించి -
మోక్ష మార్గము చూపిన దేవా - రక్షణ భాగ్యము నీవే ప్రభువా ||నీనామమే||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment