సృష్టికర్తవైన యెహోవా - నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ -
మంటికి రూపమిచ్చినావు - మహిమలో స్థానమిచ్చినావు -
నాలో నిన్నుచూసావు - నీలో నన్ను దాచావు -
నిస్వార్థమైన నీప్రేమ - మరణముకంటె బలమైనది నీప్రేమ ||సృష్టికర్తవైన||
మంటికి రూపమిచ్చినావు - మహిమలో స్థానమిచ్చినావు -
నాలో నిన్నుచూసావు - నీలో నన్ను దాచావు -
నిస్వార్థమైన నీప్రేమ - మరణముకంటె బలమైనది నీప్రేమ ||సృష్టికర్తవైన||
1. ఏ కాంతిలేని నిశీధిలో - ఏ తోడులేని విషాదపు వీధులలో - ఎన్నో అపాయపు అంచులలో - నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2)
యేసయ్యా నను అనాథగా విడువక - నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) ||సృష్టికర్తవైన||
2. నిస్సారమైన నా జీవితములో - నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేదించగా - నశించిపోతున్న నన్ను వెదకివచ్చి - నన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2)
యేసయ్యా నను కృపతో బలపరచి - ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి (2) ||సృష్టికర్తవైన||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment