116
రారాజు జన్మదినము
రా - హిందుస్థాని తోడి, తా ఆది
రారె చూతము - రాజసుతుని - రేయి జనన మాయెను = రాజులకు రా - రాజు మెస్సయ్య - రాజితంబగు తేజమదిగో ||రారె||
1.దూతగణములన్ - దేరి చూడరే - దైవవాక్కులన్ - దెల్పగా = దేవుడే మన - దీన రూపున -(2) ధరణి కరిగె నీ - దినమున (2) ||రారె||
2.కల్ల గాదిది - కలయు గాదిది - గొల్ల బోయల - దర్శనం = తెల్లగానదే తేజరిల్లెడి - (2) తారగాంచరె - త్వరగ రారే (2) ||రారె||
3. బాలుడడుగో - వేల సూర్యుల - బోలు సద్గుణ - శీలుడు = బాల బాలికా - బాలవృద్ధుల (2) నేల గల్గిన - నాధుడు (2) ||రారె||
4.యూద వంశము - ను ద్ధరింప దా - వీదుపురమున - నుద్భవించే = సదమలంబగు - మదిని గొల్చిన - (2) సర్వ జనులకు సార్వభౌముడు (2) ||రారె||
- శ్రీ చెట్టు భానుమూర్తి
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment