474
యేసుకొరకే జీవింతును
రా - ముఖారి, తా - ఆది
యేసుని కొరకై యిల జీవించెద - భాసురముగ నే ననుదినము = దోసములన్నియు బాపెను మోక్ష - ని వాసమున ప్రభు జేర్చునుగా ||యేసుని||
1.నాశనకరమగు గుంటలో నుండియు - మోసకరంబగు యూబినుండి = నాశచే నిలపై కెత్తెను నన్ను పి - శాచి పథంబున దొలగించెన్ ||యేసుని॥
2.పలువిధముల పాపంబును జేసితి - వలదని ద్రోసితి వాక్యమును - కలుషము బాపెను కరుణను బిలిచెను - సిలువలో నన్నాకర్షించెను ||యేసుని||
3.అలయక సొలయక సాగిపోదును - వెలయగ నా ప్రభు మార్గములన్ = కలిగెను నెమ్మది కలువరి గిరిలో - విలువగు రక్తము చిందించిన ప్రభు ||యేసుని||
4.శోధన బాధలు శ్రమలిల కల్గిన - ఆదుకొనును నా ప్రభువనిశం = వ్యాధులు లేములు మరణము వచ్చిన - నాధుడే నా నిరీక్షణగున్ ||యేసుని||
5.బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు - గుప్తమై యున్నవి - ప్రభునందు = అద్భుతముగ ప్రభు - వన్నియునొసగి - దిద్దును నా బ్రతుకంతటిని ||యేసుని||
6.అర్పించెను దన ప్రాణమునాకై - రక్షించెను నా ప్రియ ప్రభువు = అర్పింతును నా యావజ్జీవము - రక్షకు డేసుని సేవింప ||యేసుని||
7.ప్రభునందానందింతును నిరతము - ప్రార్థన విజ్ఞాపనములతో = విభుడే దీర్చును యిలనా చింతలు - అభయముతో స్తుతియింతు ప్రభున్ ||యేసుని॥
8.యౌవన జనమా - యిదియే సమయము యేసుని చాటను రారండి = పావన నామము - పరిశుద్ధ నామము - జీవపు మార్గము - ప్రచురింపన్ ||యేసుని||
- రావి జాన్ సుందరావు
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment