13 September 2020

Kanipinchadaye Kanuchupulona | కనిపించదాయే కనుచూపులోన

కనిపించదాయే కను చూపులోన 
ఒక ఆశ నా జీవితాన
కరుణించి యేసు ప్రేమించె నన్ను 
దుఃఖించి నిను చేరునప్పడు.           
                                 ||కనిపించ||
1. పలుమార్లు నేను పడిపోతినయ్య
    పాపాల కూపంబులో(2)
    దరి కానరాక దారేది లేక (2)
   విలపించింది మొరలిడితి నాయేసువా
                                 ||కనిపించ||
2. ప్రకటింతును నేను నీనామ ఘనతన్
    నిత్యంబు నా యేసువా (2)
    నీకెంత ప్రేమ నీకెంత జాలి (2)
    నన్నా దరించితివి నా యేసువా       
                                 ||కనిపించ||

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...