Seeyonu patalu santhoshamuga | సీయోను పాటలు సంతోషముగా

692
సీయోను పాటలు సంతోషముగా - పాడుచు సీయోను వెళ్లుదము

లోకాన శాశ్వతానందమేమియు - లేదని చెప్పెను ప్రియుడేసు - 
పొందవలె నీ లోకమునందు - కొంతకాల మెన్నో శ్రమలు ||సీయోను||

ఐగుప్తును విడచినట్టి మీరు - అరణ్యవాసులే ఈధరలో-
నిత్యనివాసము లేదిలలోన - నేత్రాలు కానానుపై నిల్పుడి ||సీయోను||

మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్ననేమి - 
నీ రక్షకుండగు యేసే నడుపును - మారని తనదు మాట నమ్ము ||సీయోను||

ఐగుప్తు ఆశలనన్నియు విడిచి - రంగుగ యేసుని వెంబడించి -
కోరహు పాపంబు మాని - విధేయులై విరాజిల్లుడి.||సీయోను||

ఆనందమయ పరలోకంబు మనది - అక్కడనుండి వచ్చునేసు - 
సీయోను గీతము సొంపుగ కలసి - పాడెదము ప్రభుయేసుకు జై ||సీయోను||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: