Samarpana cheyumu | సమర్పణ చేయుము ప్రభువునకు

సమర్పణ చేయుము ప్రభువునకు - నీ దేహము ధనము సమయమును 

1.అబ్రహామును అడిగెను ప్రభువపుడు - ఇస్సాకును అర్పణ యిమ్మనెను - 
నీ బిడ్డల సేవకు - నిచ్చెదవా? నీవిచ్చెదవా? ||సమర్పణ||

2.ప్రియము దేవునికి హేబెలు బలి - హేయము కయీనుని అర్పణము -
కళంకము కల్మష మంటనిది - నీ విచ్చెదవా ? ||సమర్పణ||

3.అయిదు రొట్టెలు చేపలు రెండు - అయిదువేలకు ఆహారముగా -
అర్పించెనా బాలు - డాకటివేళ - అట్లిచ్చెదవా? ||సమర్పణ||

4.ప్రభుని ప్రేమించిన పేదరాలు - కాసులు రెండిచ్చెను కానుకగా - 
జీవనమంతయు - దేవునికిచ్చెన్ - నీ విచ్చెదవా? ||సమర్పణ||

5.నీ దేహము దేవుని ఆలయము - నీ దేవుడు మలిచిన మందిరము -
సజీవ యాగముగా - నిచ్చెదవా - నీ విచ్చెదవా? ||సమర్పణ ||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: