Nee rakthame nanu lyrics నీ రక్తమే నీ రక్తమే

నీ రక్తమే.. నీరక్తమే... నన్ శుద్దికరచున్ నీ రక్తమే నా బలము 

1.నీ రక్త ధారలే ఇల - పాపికాశ్రయంబిచ్చును (2)
పరిశుద్ధ తండ్రి పాపిని - కడిగి పవిత్ర పరచుము (2) ||నీ రక్తమే||

2.నశించు వారికి నీ సిలువ - వెర్రితనముగ నున్నది (2)
రక్షింపబడుచున్న పాపికి - దేవుని శక్తియై యున్నది (2) ||నీ రక్తమే||

3.నీ సిల్వలో కార్చినట్టి - విలువైన రక్తముచే (2)
పాప విముక్తి చేసితివి - పరిశుద్ధ దేవ తనయుడా (2) ||నీ రక్తమే||

4.పంది వలె పొర్లిన నన్ను - కుక్క వలె తిరిగిన నన్ను (2)
ప్రేమతో చేర్చుకొంటివి - ప్రేమార్హ నీకే స్తోత్రము (2) ||నీ రక్తమే||

5.నన్ను వెంబడించు సైతానున్ - నన్ను బెదరించు సైతానున్ (2)
దునుమాడేది నీ రక్తమే - దహించేది నీ రక్తమే (2) ||నీ రక్తమే||

6.స్తుతి మహిమ ఘనతయు - యుగయుగంబులకును (2)
స్తుతి పాత్ర నీకే చెల్లును - స్తోత్రార్హుడా నీకే తగును (2) ||నీ రక్తమే||

No comments: