మన ప్రభు యేసుని ఆ ... ఆ ... ఆ ...
1. మోషే కంటే శ్రేష్టుడు -
అన్ని మోసములనుండి విడిపించున్
వేషధారులను ద్వేషించున్ -
ఆశతో మ్రొక్కెదము ||సాగిల||
2. అహరోను కంటే శ్రేష్టుడు -
మన ఆరాధనకు పాత్రుండు
ఆయనే ప్రధానయాజకుడు -
అందరము మ్రొక్కెదము ||సాగిల||
3. ఆలయము కంటే శ్రేష్ఠుడు -
నిజ ఆలయముగ తానే యుండెన్
ఆలయము మీరే యనెను
ఎల్లకాలము మ్రొక్కెదము ||సాగిల||
4. యోనా కంటే శ్రేష్టుడు -
ప్రాణ దానముగా తన్నర్పించెన్
మానవులను విమోచించెన్
ఘనపరచి మ్రొక్కెదము ||సాగిల||
5. సొలోమోను కంటే శ్రేష్టుడు -
సర్వజ్ఞానమునకు ఆధారుండు
పదివేలలో అతి ప్రియుండు -
పదిలముగా మ్రొక్కెదము ||సాగిల||
6. రాజుల కంటే శ్రేష్ఠుడు -
యాజకులనుగా మనలను జేసెన్
రారాజుగ త్వరలో వచ్చున్ -
రయముగను మ్రొక్కెదము ||సాగిల||
7. అందరిలో అతి శ్రేష్ఠుడు -
మన కందరికి తానే ప్రభువు
హల్లెలూయకు పాత్రుండు -
అనుదినము మ్రొక్కెదము ||సాగిల||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment