యేసుని చేరుకునే - విశ్వాసం నీకుందా
రావయ్య యేసయ్యా - వేగరావయ్యా
రావయ్య యేసునాధా - వేగమె రావయ్య ||రాకడ||
1. యేసయ్య రాకడ సమయంలో - ఎదురేగే రక్షణ నీకుందా (2)
లోక ఆశలపై విజయం నీకుందా (2) ||రావయ్య||
2. ఇంపైన ధూపవేదికగా - ఏకాంత ప్రార్ధన నీకుందా (2)
యేసునాశించే - దీనమనస్సుందా(2) ||రావయ్య||
3. దినమంతా దేవుని సన్నిధిలో - వాక్యం కొరకు ఆకలి నీకుందా (2)
యేసు నాధునితో - సహవాసం నీకుందా (2) ||రావయ్య||
4. శ్రమలోన సహనం నీకుందా - స్తుతియించే నాలుక నీకుందా (2)
ఆత్మలకొరకైన - భారం నీకుందా ,(2) ||రావయ్య||
5. నీ పాత రోత జీవితము - నీ పాప హృదయం మారిందా (2)
నూతన హృదయంతో - ఆరాధన నీకుందా (2) ||రావయ్య||
6. అన్నిటికన్నా మిన్నగను - కన్నీటి ప్రార్ధన నీకుందా (2)
ఎల్లవేళలలో - స్తుతియాగం నీకుందా (2) ||రావయ్య||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment