యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)
జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)
మనమంతా జగమంతా - తారవలె క్రీస్తును చాటుదాం
హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ - వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్
1. ఆకాశమంతా ఆదూతలంతా
గొంతెత్తి స్తుతి పాడగా
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే నిత్య మహిమ
భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులు
ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి
||మనమంతా||
2. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
యేసయ్యను దర్శించిరి
ఎంతో విలువైన కానుకలను అర్పించి
రారాజును పూజించిరి (2)
హేరోదుకు పురజనులకు శుభవార్త చాటిరి
అవనిలో వీరును దూతలై నిలిచిరి
||మనమంతా||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment