236
క్రీస్తు పునరాగమనము
రాజాధి రాజా రారా - రాజులకు రాజువై రారా - రాజ యేసు రాజ్యమేల రారా - రవికోటి తేజ యేసు రారా - ఓ... మేఘ వాహనంబు మీద వేగమే - ఓ.. మించు వైభవంబు తోడ వేగమే ||రాజాధి||
1.ఓ..భూజనంబులెల్ల తేరిచూడగా - ఓ.. నీ జనంబు స్వాగతంబు నీయగా = నీ రాజ్యస్థాపనంబు సేయ - భూరాజులెల్ల గూలిపోవ - భూమి యాకసంబు మారిపోవ - నీ మహా ప్రభావమున వేగ ||రాజాధి||
2.ఆ... ఆకసమున దూత లార్భటింపగా - ఆ.. ఆదిభక్త సంఘసమేతంబుగా = ఆకసంబు మధ్య వీధిలోన - ఏక మై మహాసభజేయ - యేసునాధ ! నీదు మహిమలోన - మాకదే మహానందమౌగ ||రాజాధి||
3.ఓ... పరమ యెరుషలేము పుణ్యసంఘమా - ఓ.. గొరియపిల్ల క్రీస్తు పుణ్యసంఘమా - పరమ దూతలారా! భక్తులారా! పౌలపోస్తులారా పెద్దలారా! గొరియ పిల్ల యేసురాజు పేర క్రొత్త గీతమెత్తి పాడరారా ||రాజాధి||
- ఈ.డి. నిత్యానందము
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment