నా సర్వస్వ మేసుకే నా సుజీవము
నాదు దైవము దివి దివ్య తేజము (2)
1.కృంగినవేళ - భంగపడిన వేళ - నా దరికి చేరెను
చుక్కాని లేని నావవలె నేనుండ - అద్దరికి చేర్చెను (2)
ఆత్మతో నింపెను - ఆలోచన చెప్పెను ||నాదు||
2.సాతాను బందీనై - కుములుచున్న వేళ - విడిపించె శ్రీ యేసుడే
రక్తమంతా కార్చి ప్రాణమె బలిచేసి - విమోచన దయచేసెనే (2)
సాతానున్ అణగదొక్క - అధికారం బలమిచ్చెనే ||నాదు||
3.కారుమేఘాలే - క్రమ్మిన వేళ - నీతి సూర్యుడే నడుపును
తుఫానులెన్నో చెలరేగి లేచినను - నడుపును నా జీవిత నావన్ (2)
త్వరలో ప్రభు దిగివచ్చును - తరలిపోదును ప్రభునితో ||నాదు||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment