641
ఓ యేసు నీ ప్రేమ - ఎంతో మహానీయము
ఆకాశ తార పర్వత సముద్రములకన్న గొప్పది
1. ఆగమ్య ఆనందమే - హృదయము నిండెను
ప్రభుని కార్యములు - గంభీరమైనవి (2)
ప్రతిఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు
||ఓ యేసు||
2. సంకట సమయములో - సాగలేకున్నాము
దయజూపు నామీద - అని నేను మొర పెట్టగా
వింటినంటివి నామొరకుముందే - తోడునుందునంటివి
||ఓ యేసు||
3. మరణాంధకారపు - లోయనే సంచరించిన
నిరంతర మేసు - నాదు కాపరియై
కరమునిచ్చి నన్నుగాయుచు నడుపు - కరుణగల ప్రభువు.
||ఓ యేసు||
4. కొదువలెన్ని యున్న - భయపడను నేనెపుడు
పచ్చిక బయలులో - పరుండజేయును
భోజన జలములతో - తృప్తి పరచుచు -
నాతో నుండుయేసు ||ఓ యేసు||
5. దేవుని గృహములో - సదా స్తుతించెదను
సంపూర్ణ హృదయముతో - సదా భజించెదను
స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు - హల్లెలూయ ఆమెన్
||ఓ యేసు||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment