Dasula Prardhana | దాసుల ప్రార్థన

373         
అడుగుడి, మీ కీయబడును 
రా - పంతువరాళి,.   తా - ఆది

దాసుల ప్రార్థన - దప్పక యొసగెడు - యేసునాయకుడె మా వేల్పు = దోసములు సేయు - దుర్జనుడైనను - దోసి లొగ్గి బర - వాసి జేయునట ||దాసుల॥

1. జన రహిత స్థల - మున జని వేడెడి - మనుజుల ప్రార్థన - వినుచుండున్ = దన పాదము న - మ్మిన సాధూత్తమ - జనులను జూచిన - సంతస మిడునట ||దాసుల||

2. మది విశ్వాసము - గూడిన ప్రార్థన - సదయత వినుటకు - జెవులొగ్గున్ = హృదయము కనుగొని - యుచిత సమయమున - గుదురుగ భక్తుల - కోర్కె లిచ్చునట ||దాసుల||

3. ముదమున నిద్దరు- ముగ్గురు నొకచో - బదిలముగా దను బ్రార్థింపన్ = వదలక దానట వచ్చి యుందు నని మృదువుగ బలికిన - కృత రక్షణుడట  ||దాసుల||
                                   - పురుషోత్తము చౌదరి
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: