656
దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు (3)
1.ఏదేనులో ఆదాముతోనుండెన్ - హానోకు తోడ నేగెను = దీర్ఘ దర్శకులతో నుండెన్ - ధన్యులు దేవుని గలవారు ||తోడుగ||
2.దైవాజ్ఞను శిరసావహించి - దివ్యముగనబ్రాహాము - కన్న
కొమరుని ఖండించుటకు - ఖడ్గము నెత్తినయపుడు||తోడుగ||
3.యోసేపు ద్వేషించబడినపుడు - గోతిలో త్రోయ బడినపుడు = శోధనలో చెరసాలయందు - సింహాసన మెక్కినయపుడు ||తోడుగ||
4.ఫరోరాజు తరిమిన యపుడు -ఎర్రసంద్రపు తీరమున యోర్దాను నది దాటినపుడు - ఎరికో కూలినయపుడు ||తోడుగ||
5.దావీదు సింహమునెదరించి - ధైర్యాన చీల్చినయపుడు గొల్యాతును హతమార్చినపుడు - సౌలుచే తరుమ బడినపుడు ||తోడుగ||
6.సింహపుబోనులో దానియేలు - షద్రకు మేషాకబెద్నెగో అగ్ని గుండములో వేయబడున్ - నల్గురుగా కనబడినపుడు ||తోడుగ||
7.పౌలు బంధించబడినపుడు - పేతురు చెరలో నున్నప్పుడు = అపోస్తలుల విశ్వాసులు - హింసింపబడిన యపుడు ||తోడుగ||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment