405
దేవుడే మన యాశ్రయము
(దావీదు కీర్తన 46)
రా - శంకరాభరణం, తా - ఏక
దేవుడే నా కాశ్రయంబు - దివ్యమైన దుర్గము = మ - హా వినోదు డాపదల స - హాయుడైనన్ బ్రోచును - అభయ - మభయ - మభయ మెప్పు - డానంద - మానంద - మానంద - మౌగ ||దేవుడే||
1.పర్వతములు కదిలిన నీ - యుర్వి మారుపడినను = సర్వమున్ ఘోషించుచు నీ - సంద్ర ముప్పొంగినన్ - అభయ - మభయ - మభయ ||దేవుడే||
2. దేవు డెప్డు తోడుగాగ - దేశము వర్ధిల్లును = ఆ - తావునందు ప్రజలు మిగుల - ధన్యులై వసింతురు - అభయ - మభయ - మభయ ||దేవుడే||
3.రాజ్యముల్ కంపించిన భూ - రాష్ట్రముల్ ఘోషించిన = పూజ్యుడౌ యెహోవ వైరి - బూని సంహరించును - అభయ - మభయ - మభయ ||దేవుడే||
4.విల్లువిఱుచు నాయన తెగ - బల్లెము నఱకునాయన = చెల్లచెదర జేసి రిపుల - నెల్లద్రుంచు నాయనే - అభయ - మభయ - మభయ ||దేవుడే||
5.పిశాచిపూర్ణబలము నాతో - బెనుగులాడ జడియను = నశించు శత్రు గణముదేవు - నాజ్ఞ వలన మడియును - అభయ - మభయ - మభయ ||దేవుడే||
6.కోటయు నాశ్రయమునై యా - కోబు దేవు డుండగ = ఏటికింక వెరవ వలయు - నెప్డు నాకు బండుగ - యభయ - మభయ - మభయ ||దేవుడే||
- పంతగాని పరదేశి
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment