Sandiyamu veedave | సందియము వీడవే

390
విశ్వాసమువలని విశ్రాంతి
 రా - మారువ, తా - అట
(చాయ: మంగళంబని పాడరే)

  సందియము వీడవే - నా మనసాయా - నందమున గూడవే = సందియము లింకేల నిను సుఖ - మొంద జేసెడు క్రీస్తు రక్తపు - బిందువులు శుభవార్త వాక్యము - లందు గని తెలి వొంది బ్రతుకుచు ||సందియము||

1.చింత లిక మానుము - లోకులు దెల్పు - భ్రాంతుల్ బడబోకుము = ఎంత వింత దురంత పాపము - లంతటను దన రక్తమున గో - రంత లేకయె దుడుచు నని సి - ద్ధాంత మగు ప్రభు వాక్యమును విని ||సందియము||

2.పాపములు వీడుము - నీ విక బశ్చా - త్తాపమున గూడుము = ఏపు మీరిన యోర్పుతో నొక - పాపికై నలయంబు గోరక - పాపులందఱు దిరిగి వచ్చెడు - కోపు గోరెడు కర్త దరిజని ||సందియము||

3.నెంచుకో - యేసుని కరుణా - సారము దలంచుకో =  భారముల్ మోయుచు శ్రమన్ బడు - వార లందఱు నమ్మినా దరి - జేర విశ్రమ మిత్తు నను ప్రభు - సార వాక్కులు చక్కగా విని ||సందియము||

4.నిమ్మళము నొందుము - రక్షకుని పలుకు - నమ్ముకొని యుండుము = ఇమ్మహిని బాపులకు నై ప - క్షమ్ము జేసి పరాత్పరుని సము - ఖమ్మునందు చిత్తమ్ముగా - కాయమ్ము బలియిడు నీ ప్రభుని గని ||సందియము||

5.ప్రేమ దయాశాంతముల్ - కర్తకు భూషా - స్తోమము లనంతముల్ = నీ మొఱల్విని యేసునాధ - స్వామి తన రక్తమున బాపము -దోమి నిన్న కళంకు జేయును - నీ మదిన్ దగ నమ్ముకొని యిక ||సందియము||
- పురుషోత్తము చౌదరి 
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: