158
ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు
రా - యమునా కళ్యాణి, తా - అట
(ఛాయ: కలుగును గాక)
సీయోనుకన్యా - సంభ్రమపడుచు - వేయుము కేకల్ = పాయక నీ రాజు - భారవాహక మెక్కి - బాలస్తోత్రములతో - బైలుదేరి వచ్చె ||సీయోను||
1.హెబ్రాయిలోను - నీ రాజు పేరు - యూదుల రాజు = హెబ్రీయ జను లను - అబ్రాము కొడుకులను - విభవదేశము జేర్చు - శుభరాజు యీతండే ||సీయోను||
2.హెల్లేనీలోను - నీ రాజు పేరు - యూదులరాజే = యెల్ల పాపులబ్రోచు - తాల్మి రక్షకు డితడు - చల్లని ప్రభు వని - గొల్గొత మ్రోగెను ||సీయోను||
3.ఉర్విరోమాలో నీ రాజు పేరు - యూదులరాజే = సర్వ రాష్ట్రకులకు బూర్వ - పితరులతోను - వరసింహాసన మిచ్చు - వర దేశాధిపు డితడు ||సీయోను||
4.వాసిగ హెబ్రీ హెల్లెనీలో - రోమాయిలోను = హోసన్నా హోసన్నా ప్రభుని పేరట వచ్చు - మెస్సీయ్యదావీదు - కొడుకా శ్రీ శుభములు ||సీయోను||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment