Devuni prema idigo | దేవుని ప్రేమ యిదిగో

149
క్రీస్తు నందు ప్రత్యక్షమైన దేవుని ప్రేమ
రా - ఆనంద భైరవి,  తా - కురుఝుంపే

దేవుని ప్రేమ యిదిగో - జనులారా - భావంబునం దెలియరే = కేవలము నమ్ముకొనిన - పరలోక - జీవంబు మన కబ్బును ||దేవుని||

1.సర్వలోకము మనలను తన వాక్య - సత్యంబుతో  జేసెను సర్వోపకారుడుండే - మనమీద - జాలిపరుడై యుండెను ||దేవుని||

2.మానవుల రక్షింపను - దేవుండు - తనకుమారుని బంపెను = మన శరీరము దాల్చెను - ఆ ప్రభువు - మన పాపముకు దూరుడే ||దేవుని||

3.యేసు క్రీస్తను పేరున - రక్షకుడు వెలసి నాడిలలోపల = దోసకారి జనులతో - నెంతో సు - భాషలను బల్కి నాడు ||దేవుని||

4.పాపభారంబు తోడ - నే ప్రొద్దు - ప్రయాసముల బొందెడి = పాపులందరు నమ్మిన - విశ్రాంతి - పరిపూర్ణమిత్తుననెను ||దేవుని||

5.సతులైన పురుషులైనన్ - యాకర్త సర్వ జనుల యెడలను = సత్ప్రేమగ నడిచేను - పరలోక సద్భోధలిక జేసెను ||దేవుని||

6.చావు నొందిన కొందరిన్ - యేసుండు - చక్కగా బ్రతికించెను సకల వ్యాధుల రోగులు - ప్రభు నంటి - స్వస్థంబు తా మొందిరి ||దేవుని||

7. గాలి సంద్రపు పొంగులన్ - సద్గణపి - నీళ్ళ పై నడచినాడే = మేలుగల యద్భుతములు - ఈలాగు - వేల కొలదిగ జేసెను ||దేవుని||

8. చేతుల కాళ్లలోను - రా రాజు - చేర మేకులు బొందెను = పాతకులు గొట్టినారే - పరిశుద్ధ - నీతి తా మోర్వలేకన్ ||దేవుని||

9.ఒడలు రక్తము గారగ - దెబ్బలు - చెడుగు లందఱు గొట్టిరి - వడిముళ్లు తలమీదను బెట్టిరి - ఓర్చెనో రక్షకుండు ||దేవుని||

10.ఇన్ని బాధలు బెట్టుచు దను జంపు - చున్న పాప నరులను = మన్నించు మని తండ్రిని యేసుండు - సన్నుతితో వేడెను ||దేవుని||

12.రక్షకుడు మృతి బొందగా - దేశంబు - తక్షణము చీకటయ్యెన్ = రక్షకుడు మృతినొందగ తెరచినిగి - రాతి కొండలు పగిలెను ||దేవుని||

11.రాతి సమాధిలోను - రక్షకుని - నీతిగల దేహంబును = పాతి పెట్టిరి భక్తులు - నమ్మిన - నాతు లందఱు జూడగా        ||దేవుని||

12.మూడవ దినమందున - యేసుండు - మృతిగెల్చి లేచినాడు = నాడు నమ్మిన మనుజులు చూచిరి - నలువది దినములందున్ ||దేవుని||

14.పదనొకండు మారులు - వారలకు - బ్రత్యక్షు డాయె నేసు = పరలోకమున కేగెను - తన వార్త - బ్రకటించు మని పల్కెను  ||దేవుని||

15.నమ్మి బాప్తిస్మమొందు - నరులకు - రక్షణ మరి కల్గును = నమ్మ నొల్లక పోయెడు - నరులకు - నరకంబు సిద్ధమనెను ||దేవుని||
                          - గొల్లపల్లి సతానియేలు
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: