555
బాలల జన్మ దినోత్సవము
రా - కమాసు,తా - త్రిపుట
(చాయ: ఎంత చక్కని యేసు పుట్టె మనకు)
ఆశీర్వాదము నీయుమ - మా పరమజనక - యాశీర్వాదము నీయుమ = ఆశలు దీరంగ - నాయు వొసంగుచు - వాసిగ కరుణను - వర్ధిల్ల బిడ్డకు ||ఆశీర్వా||
1.యేసు పెరిగిన యట్టులే - నీ దయయందు - ఈ సుబిడ్డను పెంచుము = వాసిగ మనుజుల - కరుణయందున బెరుగ - భాసుర వరమిచ్చి - బాగుగ బెంచుము ||ఆశీర్వా||
2.నెనరు మీరగ మోషేను - నెమ్మదియందు - తనర బెంచినట్లుగ = ఘనముగ నీ శాంతి - సంతసములయందు - తనర నీ బిడ్డను - తగురీతి బెంచుమ ||ఆశీర్వా||
3.ఏరీతి సమూయేలును - నీ సన్నిధిలో - నేపుగ బెంచితివో = యారీతి నీ బిడ్డ నాత్మ స్నేహమునందు - కోరి బెంచుమ ప్రభువ - కోర్కెలూ రంగ వేగ ॥ఆశీర్వా||
4.సత్య విశ్వాసమునందు - చక్కగ బెరుగ శక్తి యొసంగినడ్పుమా = సత్య వాక్యమునందు - సరగను వర్ధిల్ల - నిత్యము నీకృప - నిచ్చి బ్రోవుమ ప్రభువ||ఆశీర్వా||
5.భక్తి ప్రేమల నీ బిడ్డ - బాగుగా బెరుగ - శక్తి నీయుమా ప్రభువ = ముక్తి పథంబున ముద్దుగ నడువంగ - యుక్త జ్ఞానము నిచ్చి - యుద్ధరించుమ ప్రభువ ||ఆశీర్వా||
- తూలూరి ప్రకాశము
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment