Sarvachithambu needenayya | సర్వచిత్తంబు నీదేనయ్యా

451
నీ చిత్తమే సిద్దించు ప్రభూ
రా - శంకరాభరణం,    తా - ఆది

1.సర్వచిత్తంబు నీదేనయ్యా - స్వరూపమిచ్చు కుమ్మరివే = సారే పైనున్న మంటినయ్యా - సరియైన పాత్రన్ చేయుమయ్యా - సర్వేశ్వరా నేరిక్తుండను - సర్వదా నిన్నే సేవింతును ||సర్వ||

2.ప్రభూ ! సిద్ధించు నీ చిత్తమే - ప్రార్ధించుచుంటి నీ సన్నిధి = పరి కింపు నన్నీ దివసంబున - పరి శుభ్రమైన హిమముకన్న  పరిశుద్ధున్ జేసి పాలింపుమా - పాపంబు బోవ నను గడుగుమా ||సర్వ||

3.నీ చిత్త మే సిద్ధించు ప్రభూ - నిన్నే ప్రార్థింతు నా రక్షకా = నీచమౌ గాయముల చేతను - నిత్యంబు కృంగి అలసియుండ - నిజమైన సర్వశక్తుం డవే  - నీ చేతబట్టి నన్ రక్షింపుమా ||సర్వ|| 

4.ఆత్మ  స్వరూప నీచిత్త మే - అనిశంబు చెల్లు ఇహపరమున =  అధికంబుగా నన్నీ యాత్మ  తో - ఆవరింపుమో నా రక్షకా అందరు నాలో క్రీస్తుని జూడ - ఆత్మతో నన్ను నింపుము దేవా ||సర్వ||
- ఏ. ఛార్లెస్ కిన్సింగర్
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: