Santhoshinchudi yandaru | సంతోషించుడి యందరు

113
క్రీస్తు జన్మదినోత్సవం
రా - శంకరాభరణం, తా - ఆది

   సంతోషించుడి - యందరు నాతో - సంతోషించుడి - యొక = వింతయగు కీర్తన బాడ వచ్చితిని - సంతోషించుడి - నాతో ||సంతో॥ 

1.అంధకార మయమైన భూమి నా - ద్యంతము వెలిగింప - దాని యా - వేశము దొలగింప = వందితుండు క్రీస్తేసు నాధుడు - వచ్చె బ్రకాశుండై - భూమికి - నిచ్చె ప్రకాశంబు ||సంతో||

2.కాన నంధకారంబు దొలగం ప్ర - కాశించెను లెండు - మీరు ప్ర - కాశింపను రండు = మానవులను సంతోషపర్చనై - మహిని నవతరించె - భక్తుల - మనము సంతసించె ||సంతో||

3.మిన్ను నుండి సంతోషోదయము - మిగుల ప్రకాశించే -  హృదయముల - దగుల ప్రకాశించే = మున్ను జేయబడిన వాగ్దత్తము - తిన్నగ నెర వేరె భక్తుల - కన్ను లాస దీరే ||సంతో|| 

4.ప్రీతియైన నీ పండుగ గూర్చి - నూతన కీర్తనను - గలసికొని - నాతో పాడుచును = నీ తరి దూరస్థుల కీ వార్తను - నే తీరున నైన - దెలుపగ - నాతుర పడవలెను ||సంతో||

5.పాపులపై దేవునికి గలిగిన - ప్రబలమైన దయను - లోకమున - జూపింపగవలెను = జూపక పోయిన లోపము మనపై - మోపఁబడును నిజము - వేగము - జూపుద మా పథము ||సంతో||
బేతాళ జాన్
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: