Sannuthinthumo prabho | సన్నుతింతుమో ప్రభో

7
దైవ నామ స్తుతి
రా - శంకరాభరణము, తా - తిశ్రజాతి ఏక
(చాయ: దేవుడా, నను గావుము)

1.సన్నుతింతుమో ప్రభో - సదమలమగు భక్తితో
కన్న తండ్రి కావుమా - కలుషము నెడబాపుమా

2. నీతి సూర్య తేజమా - జ్యోతిరత్న రాజమా
పాతక జన రక్షకా - పతిత పావన నామకా ||

3. మానవ సంరక్షకా - దీన నిచయ పోషకా
దేవమానవ నందనా - దివ్య సుగుణ మందనా||

4. ప్రేమ తత్వబోధకా - క్షేమదాత నీవెగా
కామిత ఫలదాయక - స్వామి యేసు నాయక||

5. పాపచింతలన్ని టిన్ - పారదోలుమో ప్రభో
నీ పవిత్ర నామమున్ - నిరతము స్మరియించెదన్||
 బొంత సమూయేలు
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: