518
క్రైస్తవుని ప్రతిజ్ఞ
రా - యమునా కల్యాణి, తా - త్రిపుట
(జీవితాంతము వరకు)
నేనును నా యింటివారును - నీతిసూర్యుని గొలుతుము = దీనమనసును గలిగి దేవుని - దివ్య సేవను జేతుము ||నేనును||
1.అనుదినంబును ప్రభుని దలచుచు - అలయకను ప్రార్థింతుము = అనవరత మా ప్రభుని చిత్తము - ననుకరింతుము పనులలో ||నేనును||
2.వేదవాక్య పరసమందు - విసుగు చెందక నుందుము = ఆదరంబున దైవ చిత్తము - ననుసరించుచు నడుతుము ||నేనును||
3.ఆశతోడను ప్రభుని దినమును - నాచరింతుము మరువక = విసుకు జెందక నాలయమునకు - పిన్న పెద్దల దెత్తుము ||నేనును||
4.సంఘ కార్యక్రమములందు - సహకరింతుము ప్రీతితో = భంగ పరచెడి పనులనన్నిటి - కృంగ దీసెదమనిశము ||నేనును||
5.ప్రేమతోడను పొరుగువారిని - ప్రియులుగను భావింతుము = క్షమయు స్నేహము నేర్చి ప్రభుకడ - శాంతితో జీవింతుము ||నేనును||
6.శక్తికొలది శరీరబలమును - శ్రమను క్రీస్తుకు నిత్తుము= భక్తితో హృదయమును పూర్తిగ - ప్రభునికే యర్పింతుము ||నేనును||
7.చిన్న వారలు దైవరాజ్యపు - చిఱుత వారసులంచును = అన్ని వేళల వారి వృద్ధికి - మిన్నగ దోడ్పడెదము ||నేనును||
8.పెద్దవారలు దైవజనులని - పేర్మితో భావింతుము = శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును - శ్రద్ధతోడను జూపుచు ||నేనును||
9.జీవితంబున ప్రభుని ప్రేమా - శిస్సులను ప్రసరింతుము = దివ్యజ్యోతుల రీతి వెలుగుచు - దివ్య సన్నిధి నుందుము ||నేనును||
- ఏ. చార్లెస్ కిన్సింగర్
DOWNLOAD MP3 SONG HERE
No comments:
Post a Comment