Na prana priyuda | నా ప్రాణ ప్రియుడా యేసు రాజా

నాప్రాణ ప్రియుడా యేసు రాజా
అర్పింతును నా - హృదయార్పణ 
విరిగి నలిగిన ఆత్మతోను
హృదయ పూర్వక ఆరాధనతో - సత్యముగా 

1.అద్భుతకరుడా ఆలోచన - 
   ఆశ్చర్య సమాధాన ప్రభువా 
   బలవంతుడా బహు ప్రియుడా 
   మనోహరుడా మహిమరాజా - స్తుతించెదన్ 

2.విమోచన గానములతో - 
   సౌందర్య ప్రేమ స్తుతులతో 
   నమస్కరించి ఆరాధింతున్ - 
   హర్షింతును నే పాడెదను - నా ప్రభువా 

3.గర్భమున పుట్టిన బిడ్డలన్ 
   కరుణింపక తల్లి మరచునా 
   మరచినగాని నీ వెన్నడు 
   మరువవు విడువవు ఎడబాయవు - కరుణ రాజా 

4.రక్షణాలంకారములను - 
   అక్షయమగు నీ యాహారమున్ 
   రక్షకుడా - నా కొసగితివి 
   దీక్షతో నిన్ను వీక్షించుచు - స్తుతింతును 

5.నీ నీతిని నీ రక్షణను - 
   నా పెదవులు ప్రకటించును 
   కృతజ్ఞతా స్తుతులతోడ 
   నీ ప్రేమను నే వివరింతును - విమోచకా 

6.వాగ్దానముల్ నాలో నేరవేరెన్ - 
   విమోచించి నా కిచ్చితివే 
   పాడెదను ప్రహర్షింతును 
   హల్లెలూయ - హల్లెలూయ


No comments: