377
క్రీస్తునందలి అభయము
రా - హుసేని, తా - అట
నన్ను గన్నయ్య రావె నా యేసు = నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను||
1.ముందు నీ పాదారవిందము - లందు నిశ్చల భక్తి ప్రేమను = పొందికగా జేయ రావే నా - డెంద మానంద మనంత మై యుప్పొంగ ||నన్ను||
2.హద్దులేనట్టి దురాశల - నవివేకినై కూడి యాడితి = మొద్దులతో నింక కూటమి - వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను||
3.కాలము పెక్కు గతించెను - గర్వాదు లెడ దెగ వాయెను = ఈ లోక మాయ సుభేచ్ఛలు - చాలును జాలును జాలు నో తండ్రి ||నన్ను||
4.దారుణ సంసార వారధి - దరి జూపి ప్రోవ నీ కన్నను = కారణ గురువు లింకెవ్వరు - లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను||
5.నా వంటి దుష్కర్మజీవిని - కేవల మగు నీదు పేర్మిని = దీవించి రక్షింప నిప్పుడే - రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||
- పురుషోత్తము చౌదరి
-------------------------------------------
Nannu gannayya rave naa yesu = nannu gannayya rave naa prabhuva ||Nannu||
1.Mundu nee paadara vindamu - landu nischala bhakti premanu = pondikaga jeya raave naa - denda maananda mananatha mai yupponga ||Nannu||
2.Haddu lenatti durashala - navivekinai kudi yadithi = moddulatho ninka kutami - vaddayya vaddayya vaddayya thandri ||Nannu||
3.Kaalamu pekku gathinchenu - garvadu ledadega vaayenu = ee loka maaya sukechalu - chaalunu jaalunu jaaluno thandri ||Nannu||
4.Dharuna samsara vaaradhi - dari jupi prova ni kannanu - kaarana guruvu linkevvaru - lerayya lerayya lerayya thandri ||Nannu||
5.Naavanti dhuskarma jeeviki - kevala magu needu permini = deevinchi rakshimpa nippude - ravayya ravayya ravayya thandri ||Nannu||
- Purushothamu choudari
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment