123
జెకర్యా పాట
రా – బ్యాగు, తా - ఆది
ఇశ్రాయేలీయుల దేవుండే - యంతో స్తుతి నొందును గాక - యాశ్రితువౌ తనజనులకు దర్శన - మాత్మ విమోచన కలిగించే ||నిశ్రా||
1.తన దాసుఁడు దావీదు గృహంబున - ఘన రక్షణ శృంగము నిచ్చె - మన శత్రువులగు ద్వేషుల నుండియు - మనల బాపి రక్షణ నిచ్చె ||నిశ్రా||
2.దీనిని గూర్చి ప్రవక్తల నోట - దేవుడు పలికించెను దొల్లి మానక మన పితరుల గరుణింపగ - మహిలోన నిబంధన చేసె ||నిశ్రా||
3.జనకుం దగు నబ్రాహాముతో - జేసిన యా ప్రమాణము దలచి = మనము విరోధులనుండి విమోచన - గని నిర్భయులమై మెలగ ||నిశ్రా||
4.ఆయన సన్ని ధానమునందు - నతి శుద్ధిగ నీతిగ నుండ = పాయక తన సేవను నిత్యంబును - జేయగ నీ రక్షణ నిచ్చె ||నిశ్రా||
5.ధర నో శిశువా దేవుని దీర్ఘ - దర్శి ననెడు పేరొం దెదవు = పరమేశ్వరుని వాత్సల్యతతో - పాప విముక్తి బ్రజ లోంద ||నిశ్రా||
6.మానుగ రక్షణ జ్ఞాన మొసగంగ - మార్గము సిద్ధపరచుటకై దీన - మనస్సుతో బ్రభునకు ముందు - గా నడిచెదవు భయ భక్తి ||నిశ్రా||
7.మరియును సమాధాన సరణిలో - మన మిక నడువ జీకటిలో = మరణచ్ఛాయలో నుండిన వారికి - నరుణోదయ దర్శన మిచ్చె ||నిశ్రా||
8.జనక పుత్రాత్మ దేవుని కిలలో - ఘనత మహిమ కల్గును గాక - మును పిపుడెప్పుడు తనరి నట్లు యుగ - ములకును దనరారును గాకామేన్ ||నిశ్రా||
- మల్లెల దావీదు
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment