Aalinchu Deva Na Manavula | ఆలించు దేవా నా మనవుల


375       
కృప కొరకు ప్రార్థన  
రా - శ్రీరాగం, తా - అట
(చాయ: కలుగునుగాక దేవునికి మహిమ)

ఆలించు దేవా - నా మనవుల - నాలించు దేవా = యాలించు నా దేవ - యన్ని సమయంబుల - జాల గనపరచుచు - జక్కని నీ దయ||నాలించు||

1.సకల సత్య భాగ్య - సంపద నీ యందు - వికలంబు గాకుండ - వెలయు నెల్లప్పుడు||నాలించు||

2.పలుమారు నీ వొసగ - బరమ భాగ్యంబులు - పొలిసి పోదు నీదు - కలిమి కాసంతైన||నాలించు||

3. నా యఘము లన్నియు - నా తండ్రి క్షమియించు - నీ  యనుగ్రహముచే - నీ సుతుని కృతమున ||నాలించు||

4.నీ యాజ్ఞలన్నియు - నేను జక్కగ సల్ప - నీయందు నమ్మిక - నెగడించు మనిశంబు ||నాలించు||

5.నీ సేవ నొనరింప - నిండుగ నిలలోన - నీ సేవకుని కిమ్ము - నీ శుద్ధాత్మను కృపచే   ||నాలించు||
                       - పులిపాక జగన్నాధము
_________________________________
Alinchu deva- namanavula - naalinchu deva = yalinchu naa deva - yanni samayambula - jaala ganaparachuchu - jakkani nee daya. ||Nalinchu||

1.Sakhala sathya bhagya - sampada  neeyandu - vikalambu gaakunda - velayu nellapudu   ||Nalinchu||

2.Palumaru nee vosaga  -  bhagyambulu - polisi poodu needu - kalimi kaasntaina ||Nalinchu||

3.Naa yaghamu lanniyu - naa thandri  kshamiyinchu = nee yanugrahamuche - nee sutuni krutamuna ||Nalinchu||

4.Nee seva nonarimpa - ninduga nilalona - nee sevakuni kimmu - nee shudhathmanu krupache  ||Nalinchu||
               – Pulipaaka jagannadhamu 
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: