Anandamagu Mukthi | ఆనంద మగు ముక్తి

347
నిత్య జీవానందం
రా - సురటి, తా - అట

ఆనంద మగు ముక్తి - యే నా మందిరము = జ్ఞాని మానుగ దాని సుందరము ||ఆనందమగు||

1.పరదేశివలె దేహా - వరణమం దుందున్ - ధరణి కాననముగా - దర్శించు చుందున్ - నెరి దుఃఖ సుఖములు - సరిగా భావింతున్ = పరిశుద్ధాత్ముని వేఁడి - పరితృప్తి నుందు ||నానందమగు|| 

2.బహు శోధనలు నా పై - బడి వచ్చునపుడు - న హితాంధతమము న - న్నడ్డుకొన్నపుడు - నిహ బాధలన్నిన - న్నెదిరించినపుడు = నాహహ యేసు ని వల్ల - నమృతుడ నెపుడు  ||నానంద మగు|| 

3.ముందు నా మనసు దే - వుని కప్పగింతు - నందరి నస్మత్తు - ల్యముగా ప్రేమింతున్ - సందేహ రాహిత్య - సరణిలో నిల్తు = పొంద బోయెడి ముక్తి - భువియందె గాంతు ||నానంద మగు|| 
- పురుషోత్తమ చౌదరి
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: