52
సాయంతన ప్రార్థన
రా – శంకరాభరణం, తా – ఆది
ఆకాశంబు భూమియు - అంతట చీకటి యాయెను - ప్రాకెడు చీకటి సమయమున - ప్రార్ధన చేతుము మాదేవా
1.చక్కని చుక్కలు మింటను - చక్కగా మమ్మును జూడగ - ప్రక్కకు రావె వేగముగా - ప్రభువా గావుము నీ నీడన్ ||
2.చిన్న చిన్న పక్షులు - చిన్న చిన్న పూవులు = ఎన్నో ఎన్నో జీవులు - నిన్నే గొలిచి నిద్రించున్ ||
3.చిన్ని చిన్ని పాపాలు = చిన్ని చిన్ని పడకలలో - చిన్ని కన్నులు మూయంగా - చెన్నుగ యేసూ గావుమా||
4.నేలను బోయెడి బండ్లలో - నీటను బోయెడి ఓడలలో = గాలి విమానం బులలోన - కావుము దేవ ప్రయాణికులన్ ||
5.రాత్రిలో నీదు దూతలు - రమ్యంబైన రెక్కలతో = చిత్రంబుగ మమ్మును గ్రమ్మన్ - నిద్రించెదము మా దేవా ||
6.తెల్లవారుజామున - తెలివొంది మే మందరము మెల్లగ లేచి నుతి యింపస్ - మేల్కొల్పుము నా ప్రియతండ్రి ||
7.జనక తనయా శుద్ధాత్మ - జయము మహిమ స్తోత్రములు = అనిశము నీకే చెల్లునుగా - అనిశము చెల్లును నీ కామెన్ ||
– ఏ. చార్లెస్ కిన్సింగర్
DOWNLOAD MP3 SONG HERE
No comments:
Post a Comment