323
క్రైస్తవ పశ్చాతాపం
రా - అఠాణ తా - ఆది
రావయ్య యేసునాధా - మా - రక్షణమార్గము నీ - సేవఁ = జేయ మమ్ముఁ - జేపట్టుటకు ||రావయ్య||
1.హద్దు లేక మేము - ఇల - మొద్దులమై యుంటిమి - మా = కొద్ది బుద్ధులన్ని - దిద్ది రక్షింపను ||రావయ్య||
2.నిండు వేడుకతోను - మమ్ము - బెండువడక చేసి - మా = గండంబు లన్నియు - ఖండించుటకు ||రావయ్య||
3.మేర లేని పాపము - మాకు - భారమైన మోపు - నీవు = దూరంబుగాఁ జేసి - దారిఁ జూపుటకు ||రావయ్య||
4.పాపుల మయ్య మేము - పరమ - తండ్రిని గానకను - మా = పాపంబు లన్నియుఁ - పారఁ దోలుటకు ||రావయ్య||
5.అందమైన నీదు - పరమానంద పురమందు = మే మందరముజేరి ఆనందించుటకు ||రావయ్య||
No comments:
Post a Comment