స్వస్థతలేని నీ ప్రజకు - స్వస్థతనీయుమా
శాంతినినొసగుమయ్యా - స్వస్థత చేకూర్చుమా
షాలోమ్ షాలోమ్ షాలోమ్ షాలోమ్
యెహోవా రాఫా నీకే స్థుతి
1. ఐగుప్తు రోగములలో ఏదియు - నీ చెంతకు రానీయనంటివి
నిను స్వస్థపరచు దేవుడనేనని -నాకభయమిచ్చితివి
2. ఓ నీతిసూర్యుడా నీ వెలుగులో - నీ ప్రజలు స్వస్థత పొందెదరు
నీ వాక్కు పంపి మము పైకిలేపి - మము స్వస్థపరచితివి
3. నీ చెంతకు చేరిన జనులపై - నీ కృపను మెండుగా కురిపించినావు
నీవు పొందిన గాయములచే - స్వస్థత మేము నొందితిమి
No comments:
Post a Comment