ఒకసారి యోచింపవా?
ఈ నాడే నీవు ప్రభు యేసు కొరకు -
నీ హృదయ మర్పించవా?
నీ తల్లి గర్బమున నీ వుండినపుడే -
నిను చూచె ప్రభు కన్నులు (2)
యోచించి నావా ఏరీతి నిన్ను -
నిర్మించే తన చేతులు ||నీ జీవిత||
నీ లోన తాను నివసింపగోరి -
దినమెల్ల చే జాచెను (2)
హృదయంబు తలపు -
తెరువంగ లేవా యేసు ప్రవేశింపను ||నీ జీవిత||
తన చేతులందు హృదయంబు ధారల్ -
స్రవియించె నీకోసమే (2)
భరియించే శిక్ష నీ కోసమేగా -
ఒకసారి గమనించవా ||నీ జీవిత||
ప్రభు యేసు నిన్ను సంధించి నట్టి -
సమయంభు ఈ నాడేగా (2)
ఈ చోటు నుండి ప్రభు యేసు లేక -
పోభోకుమా సోదరా ||నీ జీవిత||
No comments:
Post a Comment