278
జీవాహారము
రా - ముఖారి, తా - ఆది
(చాయ: నాకై చీలిన యుగయుగముల)
జీవాహారము రమ్ము - చిరజీవాన్నము నిచ్చి - జీవిత క్షుద దీర్చుము = జీవనపథములో - చీకటి పడువేళ - జీర్ణించు కొనిపోవు - జీవితాశలఁ బెంచ ||జీవా||
1.విందుగృహమునకేగి - వీక్షింతు భ్రమతో నీ - వివిధ సుభోజ్యంబులన్ = విచ్ఛిన్నమైన నీ - విమల దేహపు విందు - వికలంబౌ మనసుతో - వినుతించి, తినుచుందు ||జీవా||
2.రుధిర ధారలలోన - ఋజువౌ నీ ప్రేమలు - రూపుమాయును పాపము = ఋతద్రాక్ష వల్లీ నీ రుధిరపానముచేత - ఋణభారములు దీరి - రుచి యించు నా బ్రతుకు ||జీవా||
3.భవదీయ స్మరణార్థం - పతితుల శరణార్థం - ఫలియించు యీహోమము = ప్రభువా నాయాత్మలో - ప్రతిబింబమై వెలసి - పానార్పణంబౌను - ప్రతిరక్త బిందువు ||జీవా||
4.ఆత్మంతఃపురములో - ఆంతర్య గదిలోన - ఆరాధింతు నీ నామము = అలనాటి నీ రక్త - నవనిబంధన నేడు - అపురూపమై నాలో - నవతరించును దేవా ||జీవా||
- ఏ . బి . మాసిలామణి
No comments:
Post a Comment