119
యేసు లోకమునకు వెలుగు
రా - ముఖారి, తా - ఆది
లోకమంతట వెలుగు ప్రకాశించెను - యేసు జన్మించినపుడు = ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు - లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి ||లో||
1.నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను - చీకటి దాని గ్రహింప లేదు = నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు - వాడు చీకటిలో నడువక జీవపువెలుగై యుండుడనె యేసు ||లో||
2.ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను - చంద్రుడైన నక్కరలేదు = ఆ పట్టణములో దేవుని మహిమయే - ప్రకాశించుచున్నది యెపుడు - ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱెపిల్లయే దీపమై వెలుగుచుండు ||లో||
3.మీరు లోకమునకు వెలుగై యున్నారు గనుక - మీరు వెలుగు సంబంధులు = మీరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే - మరుగై యుండక నరులందరికి - వెలుగై యుందురనె యేసుండు ||లో||
4.చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును - చూచిరి ధన్యులై = లోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల మీద - ప్రకాశించెను గొప్ప వెలుగును - ప్రభువు యేసుకు జేయని పాడరే ||లో||
- ఆర్. దేవదాసు
No comments:
Post a Comment