06 February 2023

Neethi surya thejomayuda నీతి సూర్య తేజోమయుడా



నీతి సూర్య తేజోమయుడా - ధవళవర్ణుడా రత్నవర్ణుడా
పదివేలలో అతి శ్రేష్ఠుడా - శుద్ధుడా మహిమాన్వితుడా

పల్లవి:
మనసు మార్చు పరమ తండ్రి - నీదు ఆత్మతో నేను నిండా
మనసు మార్చు పరమ తండ్రి - నీదు రూపులో నేను మారా
నీదు మహిమతో నేను నిండా

పనికిరాని పాత్రను నేను - పడిపోయిన పామరుండన్
మంచిలేని పాపిని నేను - చీకటి నిండిన అపవిత్రుడను

నీదు సన్నిధిన్ నేను వదలి - నీదు స్మరణను నేను మాని
మలినం నిండి మార్గము తప్పి - చెదరివున్న దోషాత్ముడను

సౌఖ్యము కోరి క్షేమము మరచి - దైవ ఆజ్ఞన్ నేను విడిచి
కానరాని దూరం పోయి - ఒంటరినైనా అనాధుడను

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...