యేసు దేహము సంఘము Yesu dehamu sanghamu

259
సంఘము క్రీస్తుని దేహము 
(చాయ: ఓ మా తండ్రీ)
రా - ఆనంద భైరవి, తా - ఏక 

యేసు దేహము సంఘము - ప్రభు క్రీస్తుపై వి-శ్వాస మమరి క్రా లెడు జనము = యేసు ప్రాయశ్చిత్త రక్తము - దోసములను బాపు నంచు - నాసతోడ నమ్మి తమ ప్ర - యాసములను దీర్చుకొన్న ||యేసు||

1.స్థాపకుఁడు యెహోవా దేవుఁడు - పాపులను గావ - నోపి సుతునిఁ బంపె కరుణుఁడు = ఈ పవిత్ర సంఘమునకు - దీపము పరిశుద్ధ వేద - మేపుమీఱు శిరసు క్రీస్తు - కాపుకర్త పావనాత్మ ||యేసు||

2.వరుఁడు క్రీస్తు యేసునాధుని - మురువంపు వధువై - పరఁగు నహ విశేషఖ్యాతిని = సరిగెపట్టు నారచీర - లరయ నీతి న్యాయము లవి - యురుతరా భరణముల సుం-దరము భక్తి వర్తనంబు ||యేసు||

3.తన యమూల్య రక్తముఁ దెచ్చి - యనురక్తుఁ డీమె - కనిశ శుల్క దా నమునిచ్చి = ఘనుఁ డగు నా పావనాత్మ - తనకుఁ దోడుజేసి మంచి - పని తనమున నీమె కొక్క - భవనముఁ గట్టంగఁ బోయె ||యేసు||

4.మరణ విజయుఁ డైన వీరుఁడు - మహాబ్రములపై - నరుగుదెంచు మహిమ శూరుఁడు = నిరతప్రేమ కాముఁ డీమె - కరముబట్టి పెండ్లి యాడఁ - ద్వరగ వచ్చుఁ గాన భక్తి - పెరుగు బ్రతుకు టుత్తమంబు ||యేసు||
- పట్టాభి ప్రసంగి 

No comments: