05 March 2026

కలువరి సిలువ సిలువలో విలువ Kaluvari siluva siluvalo viluva

కలువరి సిలువ సిలువలో విలువ

కలువరి సిలువ సిలువలో విలువ - నాకు తెలిసెనుగా
కలుషము బాపి కరుణను చూపి - నన్ను వెదికెనుగా (2)
అజేయుడా విజేయుడా - సజీవుడా సంపూర్ణుడా (2) ||కలువరి||

కష్టాలలోన నష్టాలలోన - నన్నాదుకొన్నావయ్యా
వ్యాధులలోన బాధలలోన - కన్నీరు తుడిచావయ్యా (2)
మధురమైన నీ ప్రేమ - మరువగలనా ఆ ప్రేమ (2)
అనుక్షణం నీ ఆలోచన - నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి||

పాపానికైనా శాపానికైనా - రక్తాన్ని కార్చావయ్యా
దోషానికైనా ద్వేషానికైనా - మరణించి లేచావయ్యా (2)
మధురమైన నీ ప్రేమ - మరువగలనా ఆ ప్రేమ (2)
అనుక్షణం నీ ఆలోచన - నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి||

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...