238
పరిశుద్ధాత్మ కొరకు వేడుట
(చాయ: యేసు క్రీస్తుని గొల్వరన్న)
రా - మూఖరి, తా - ఆది
దైవాత్మా దిగుము దాసుల పైని - నీ దయా దృష్టిఁ - పారజేయుము ప్రేమన్ నింపు = దేవా యాత్ముండ దిగుము మమ్ముల - శుద్ధీకరించుము - దయారసముచే ||దైవాత్మా||
1.దైవాత్మా దిగుము ప్రవక్తలు - పూర్వంబు నీదు - ప్రేరణవలనఁ బ్రవచించిరి = పావురమా దిగి - మాలో వసించుము - పాపుము చీఁకటి - వెలుఁగుచు మాలో ||దైవాత్మా||
2.రమ్ము ఓ యున్నతంపు ఆత్మా - నాలుగు దెసల-నుండి మమ్ముల నావ రించు = రమ్ము రమ్ము దిగి యెండిన యెముకలు- గానగు లోకుల - మీదికి ముదమున ||దైవాత్మా||
3.మే మజ్ఞానాంధకారమునను - మునిఁగితిమి గాన - చెదరఁగఁజేయు మంధకారము = పామర జనులకుఁ బేర్మి-తో నొసఁగు ను - జ్ఞాన ప్రకా శము - నిల్పుము మాలో ||దైవాత్మా||
- మామిళ్ళ యెషయా
No comments:
Post a Comment